![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -184 లో.....ప్రేమని ధీరజ్ పట్టుకుంటాడు. అది చూసిన తిరుపతి.. ఎంట్రా రోడ్డుపై మీ రొమాన్స్ అని అంటాడు. అలా అనడంతో ప్రేమ సిగ్గుపడుతుంది. రొమాన్స్ లేదు.. ఏం లేదు మామ అని ధీరజ్ అక్కడా నుండి ప్రేమని చూస్తూ వెళ్ళిపోతాడు. మరొకవైపు శ్రీవల్లి డోర్ వేసుకొని హనీ మూన్ కాన్సిల్ అయిందని కోపంగా వస్తువులు కింద పడేస్తుంది. ఏమైందని వేదవతి డోర్ కొడుతుంది.
ఏం లేదంటూ శ్రీవల్లి కోపంగా బయటకు వెళ్ళిపోతుంది. ఏమైంది ఈ పిల్లకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందా అని వేదవతి అనుకుంటుంది. శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లేసరికి.. శ్రీవల్లి వాళ్ళ అమ్మ, నాన్న డాన్స్ చేస్తుంటారు. తనకి కోపం వస్తుంది. తను అత్తారింట్లో జరిగింది అంతా కూడా భాగ్యంకి చెప్తూ ఏడుస్తుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటూ శ్రీవల్లికి దైర్యం చెప్తుంది భాగ్యం.
ఆ తర్వాత నర్మద, ప్రేమ, శ్రీవల్లి చేసిన ప్లాన్ తిప్పి కొట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్మద ప్రేమ ఇద్దరు ఒక దగ్గరికి వెళ్లి ప్రేమ క్లాసికల్ డాన్స్ నేర్పించడానికి స్టూడెంట్స్ ని మాట్లాడతారు. ప్రేమ స్టూడెంట్స్ కి డాన్స్ క్లాస్ నేర్పిస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ డాన్స్ నేర్పిస్తున్న విషయం ఇంట్లో రామరాజుకి తెలిసి గొడవ జరుగుతుంది. అసలు నువ్వు రాకముందు ఇల్లు ప్రశాంతంగా ఉండేది.. దీనికి అంతటికి కారణం నువ్వేనని నర్మదపై కోప్పడతాడు రామరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |